వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించనున్నారు.
నేడు వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభం
Apr 29 2017 12:13 AM | Updated on Mar 22 2019 6:24 PM
– కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో పాటు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ పరిశీలకులు అనంత వెంకటరామిరెడ్డి, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, అంజాద్‌బాష (కడప), మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మురళీకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జీలు హాజరు కానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం 11.00 గంటలకు స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుందని కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Advertisement
Advertisement