జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు బుధవారం కృష్ణా బోర్డు సభ్యులు జిల్లాకు రానున్నారు.
నేడు జిల్లాకు కృష్ణా బోర్డు సభ్యుల రాక
Jan 18 2017 12:15 AM | Updated on Sep 5 2017 1:26 AM
కర్నూలు(సిటీ): జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు బుధవారం కృష్ణా బోర్డు సభ్యులు జిల్లాకు రానున్నారు. రెండురోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిటీ సభ్యులు ఉదయం బానకచెర్ల కాంప్లెక్స్, పోతిరెడ్డిపాడు, కేసీ కాల్వ, ముచ్చుమర్రి ఎత్తిపోతుల పథకం, సుంకేసుల రిజర్వాయర్లను తనిఖీ చేయనున్నారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకున్న నీటి వివరాలను కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు.
Advertisement


