పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఉమ్మారెడ్డి | Tobacco prices soar in ap on rising demand | Sakshi
Sakshi News home page

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఉమ్మారెడ్డి

Jul 10 2015 1:54 PM | Updated on May 29 2018 4:23 PM

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఉమ్మారెడ్డి - Sakshi

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఉమ్మారెడ్డి

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫమలైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫమలైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గతేడాది పొగాకు కిలోకు రూ.174  ఉంటే ఈ ఏడాది రూ.110-117 ఉందని ఆయన అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పొగాకు రైతులను పరామర్శించి, గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేసినా ప్రభుత్వానికి చలనం లేదని ఆయన మండిపడ్డారు.

ఈ నెల 14న పొగాకు అమ్మే అన్ని ఫ్లాట్ ఫాంల దగ్గర వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపడుతుందని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే గుంటూరు పొగాకు బోర్డును ముట్టడిస్తామన్నారు. పొగాకు పంటకు మద్దతు ధర లేక టంగుటూరులో కొండల్రావు అనే రైతు గుండెపోటుతో మరణించాడని ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొగాకు కిలోకు రూ.150కు పెంచాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement