బాధిత కుటుంబాలకు సాయమందిస్తాం | To provide assistance to families of the victims | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు సాయమందిస్తాం

Sep 24 2016 9:35 PM | Updated on Sep 4 2017 2:48 PM

బాధిత కుటుంబాలకు సాయమందిస్తాం

బాధిత కుటుంబాలకు సాయమందిస్తాం

గుర్రంపోడు: వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ సాయ చర్యలు చేపట్టిందని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నోముల నర్సింహ్మయ్య అన్నారు.

గుర్రంపోడు: వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ సాయ చర్యలు చేపట్టిందని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నోముల నర్సింహ్మయ్య అన్నారు. శనివారం మండలంలోని తుర్కోనిబావిలో వర్షం కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించడం జరిగిందని అన్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు అధికార యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్‌ , ఎంపీటీసీ ఆవుల వెంకన్న , టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బల్గూరి నగేష్‌ గౌడ్‌ ఉన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement