రైతులకు న్యాయం చేయాలి | To do justice to the farmers | Sakshi
Sakshi News home page

రైతులకు న్యాయం చేయాలి

Nov 23 2016 1:54 AM | Updated on May 29 2018 4:26 PM

రైతులకు న్యాయం చేయాలి - Sakshi

రైతులకు న్యాయం చేయాలి

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు దిగుబడి విక్రరుుంచే క్రమంలో మార్కెట్‌లో దోపిడీకి గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు    డాక్టర్ కె.నగేశ్
  జమ్మికుంట పత్తి మార్కెట్ సందర్శన

జమ్మికుంట : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు దిగుబడి విక్రరుుంచే క్రమంలో మార్కెట్‌లో దోపిడీకి గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చొరవ చూపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోరారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌ను నగేశ్‌తో పాటు పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు బోగ పద్మ, రాష్ట్ర యూత్ కార్యదర్శి దుబ్బాక సంపత్, జిల్లా అధికార ప్రతినిధి మందరాజేశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మార్కెట్‌లో ధర విషయంలో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. నంబర్ ధరకు క్వింటాల్‌కు రూ.150 నుంచి 300 వరకు తేడాలు పెట్టి కొనుగోళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు ఎక్కువ ధర పెట్టి మరుసటి కోత పెట్టుతున్నారని వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. జమ్మికుంట మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీ విధానాన్ని అరికట్టేందుకు, రైతులకు మంచి ధర దక్కేలా మంత్రి ఈటల రాజేందర్ చోరవ తీ సుకోవాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే చూ స్తూ ఉరుకునేది లేదని నగేశ్ హెచ్చరించారు. కార్యక్రమం లో జిల్లా నాయకులు సానా రాజయ్య, దొడ్డె యుగేందర్, జంపాల రితిష్, కొత్తూరి నరేష్, అంబాల హరీష్, గుళ్లి స తీష్, గుళ్లి సందీప్, కనుకం బాబు. ఎండి మహుముద్, కనుకం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement