పిడుగు పాటుకు గురై విద్యార్థి మృతి | Thunderbolt student died | Sakshi
Sakshi News home page

పిడుగు పాటుకు గురై విద్యార్థి మృతి

Mar 10 2017 11:43 PM | Updated on Nov 9 2018 5:02 PM

పిడుగు పాటుకు గురై విద్యార్థి మృతి - Sakshi

పిడుగు పాటుకు గురై విద్యార్థి మృతి

పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన చిలేకాంపల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి(14) అనే విద్యార్థి గురువారం రాత్రి పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.

పెండ్లిమర్రి:  వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన చిలేకాంపల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి(14) అనే విద్యార్థి గురువారం రాత్రి పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. నందిమండలానికి చెందిన కొండారెడ్డి, సునీత దంపతుల కుమారుడైన ప్రదీప్‌ ఇక్కడి జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలతో పదోతరగతి చదువుతున్నాడు. మృతుడి బంధువు నాగేంద్రారెడ్డి(16)కి గాయాలయ్యాయి. ఇతను కడపలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికులు, పోలీసుల  కథనం మేరకు... గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ప్రదీప్‌కుమార్‌రెడ్డి మామ  నవనీశ్వర్‌రెడ్డికి సంబంధించిన పొలంలో వేరుశనగ కాయలు అరబోశారు. వర్షం వస్తుడడంతో ముగ్గురు కలిసి పొలం వద్దకు వెళ్లి  కాయలు కుప్పకట్టి తిరిగి నడుచుకుంటూ వస్తుడంగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన పిడుగు పడింది. దీంతో ప్రదీప్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. నాగేంద్రారెడ్డికి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. అతడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం కోలుకున్నాడు. త్వరలో పబ్లిక్‌ పరీక్షలు రాయల్సిన సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత డడంతో ప్రదీప్‌ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృత దేహానికి కడప రిమ్స్‌ మార్చురీలో శుక్రవారం పొస్టుమాస్టరం నిర్వహించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్‌ఐ రోషన్‌ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement