పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధం | Thunderbolt on Palmyra tree | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధం

Jul 28 2016 9:32 PM | Updated on Sep 4 2017 6:46 AM

పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధం

పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధం

పొదలకూరు : పట్టణంలోని పద్మావతినగర్‌లోని ఓ తాటి చెట్టుపై గురువారం సాయంత్రం పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో చుట్టుపక్కల నివాసితులు హడలిపోయారు.

 
  • త్రుటిలో తప్పిన ప్రమాదం
పొదలకూరు : పట్టణంలోని పద్మావతినగర్‌లోని ఓ తాటి చెట్టుపై గురువారం సాయంత్రం పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో చుట్టుపక్కల నివాసితులు హడలిపోయారు. ఒక్కసారిగా వేల వాట్స్‌   లైట్లు వెలిగినట్టుగా నివాసాల ముందు వెలుగు, శబ్ధం రావడంతో భయకంపితులయ్యారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. వినాయకమాన్యం, శ్రామికనగర్‌ కాలనీవాసులు పిడుగు పడిన మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. పిడుగు పడే సమయానికి ఎవరూ లేకపోవడంతో  ప్రమాదం తప్పినట్టు అయింది. పిడుగు పడిన తాటిచెట్టుకు సమీపంలో ఆదెమ్మ నివాసం ఉంటుంది. అయితే ఆమెకు ప్రమాదం తప్పింది. పిడుగుపాటుతో పద్మావతినగర్, తొగటివీధి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement