అడవి పంది దాడి: ముగ్గురికి గాయాలు | three injured in Feral pig | Sakshi
Sakshi News home page

అడవి పంది దాడి: ముగ్గురికి గాయాలు

Sep 17 2016 1:27 PM | Updated on Sep 4 2017 1:53 PM

వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం అడవిపంది హల్‌చల్ చేసింది.

వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం అడవిపంది హల్‌చల్ చేసింది. స్థానిక పాత వీరభద్ర సినిమాహాల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు పాదచారులపై అడవిపంది దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అడవిపందిని చంపేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement