ఎమ్మెల్సీ ఇంట్లో చోరీ! | theft in mlc prathiba bharathi home | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఇంట్లో చోరీ!

Aug 5 2016 9:14 AM | Updated on Sep 4 2017 7:59 AM

నగరంలోని పీఎన్‌కాలనీ రెండవ లైనులోని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి ఇంట్లో గురువారం చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం సిటీ: నగరంలోని పీఎన్‌కాలనీ రెండవ లైనులోని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి ఇంట్లో గురువారం చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంట్లో  రెండు సంవత్సరాలుగా ఎవరూ ఉండటం లేదు. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న రెండో పట్టణ సీఐ దాడి మోహనరావు గురువారం సాయంత్రం సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆ ప్రదేశాలను పరిశీలించారు. చోరీపై ఆరా తీశారు. అక్కడ రెండు ఏసీ మిషన్లు, పూజా సామాగ్రి చోరీకి గురై ఉంటాయన్న స్థానికుల అభిప్రాయం మేరకు ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఇంటి వెనుక మద్యం సేవించి ఓ వ్యక్తి పడి ఉండడంతో పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ కేసు విషయమై ఎటువంటి ఫిర్యాదు రాలేదని, చోరీ జరిగిందన్న సమాచారంతో ఇంటికి వెళ్లి పరిశీలించానని సీఐ దాడి మోహనరావు సాక్షికి తెలిపారు. దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement