మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. క్రై ం ఎస్‌ఐ దేవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
గుండ్రాంపల్లిలో చోరీ
Aug 31 2016 12:02 AM | Updated on Sep 2 2018 3:51 PM
గుండ్రాంపల్లి(చిట్యాల): మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. క్రై ం ఎస్‌ఐ దేవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాలిగ యాదయ్య తన అత్తవారింటికి వెళ్లగా దుండగులు ఆయన ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉంచిన తులం విలువ గల బంగారు చెవి కమ్మలు, మాటీలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా గ్రామంలో తాళం వేసి ఉన్న మరో ఇంట్లోకి వెళ్లి కొంత నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement