మండలంలోని కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక(28)అనే వివాహిత కుటుంబ క లహాలతో పురుగుల మందు తాగి ఆ త్మహత్యకు పాల్పడింది.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
Dec 12 2016 10:50 PM | Updated on Nov 6 2018 7:56 PM
కంబదూరు: మండలంలోని కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక(28)అనే వివాహిత కుటుంబ క లహాలతో పురుగుల మందు తాగి ఆ త్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన వివరాలు.. సోమవారం భర్త బ్రహ్మనందరెడ్డితో కలసి ఆమె పొలంలో బెండ పంటకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ గొడవపడ్డా రు. భర్త పంటకు మందు పిచికారీ చేసే పనిలో ఉండగా ఆమె పురుగుల మందును తాగి ఆకస్మకరక స్థితిలోకి వెళ్లింది. కొద్దిసేప టి తర్వాత భర్త గమనించి ఆమెను వెంటనే కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంత పురం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. రెం డు రోజులగా వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు.
Advertisement
Advertisement