మంజీరా నీటి సరఫరా పునరుద్ధరణ | The restoration of the water supply manjira | Sakshi
Sakshi News home page

మంజీరా నీటి సరఫరా పునరుద్ధరణ

Jul 31 2016 9:58 PM | Updated on Sep 4 2017 7:13 AM

మంజీరా నీటి సరఫరా పునరుద్ధరణ

మంజీరా నీటి సరఫరా పునరుద్ధరణ

మంజీరా నీటిపథకం బోరంచ జాక్‌వెల్‌ నుంచి నారాయణఖేడ్‌ పట్టణానికి తాగునీటి సరఫరాను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆదివారం ప్రారంభించారు.

  • బోరంచ నీటిపథకం ప్రారంభం
  •  ఖేడ్‌ సంప్‌కు నీటిపంపింగ్‌
  • నారాయణఖేడ్‌:మంజీరా నీటిపథకం బోరంచ జాక్‌వెల్‌ నుంచి నారాయణఖేడ్‌ పట్టణానికి తాగునీటి సరఫరాను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆదివారం ప్రారంభించారు. గత వేసవిలో మంజీరా నదిలో నీరు లేకపోవడంతో దాదాపు ఐదారు నెలలుగా నారాయణఖేడ్‌కు మంజీరా నీటిసరఫరా నిల్చిపోయింది. ఎగువ కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో మంజీరా నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువన సింగూరు ప్రాజెక్టుకు నీరు వెళ్తున్నా మంచినీటి పథకాల వద్ద కొద్దిగా నీరు ప్రవహిస్తోంది.

    దీంతో అధికారులు మరమ్మతులు పూర్తిచేసి బోరంచ నీటిపథకం నుండి తాగునీటిని సరఫరాను అధికారులు పునరుద్ధరించారు నారాయణఖేడ్‌ పట్టణ శివారులోని సంప్‌లో నీటి పంపింగ్‌ ప్రారంభమైంది. నదిలోకి మరింత వరద నీరు వచ్చిచేరితే తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇదిలా ఉండగా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ర్యాకల్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఫ్లెక్సీలకు జలాభిషేకం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement