నల్లగొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.
నల్లగొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన బొడిగే చంద్రయ్య(65) భువనగిరి వైపు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి, వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు.