వేములవాడ మండలకేంద్రంలో మురళికృష్ణ(28) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.
వేములవాడ మండలకేంద్రంలో మురళికృష్ణ(28) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇంట్లో ఉరికి వేలాడుతూ స్థానికులు కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కాళ్లను తాడుతో కట్టేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. భార్య మౌనిక పరారీలో ఉంది. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. జీవనోపాధి నిమిత్తం వేములవాడ వచ్చి కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితంమౌనిక అనే యువతితో వివాహం అయింది. పిల్లలు లేరు. మురళీకృష్ణను భార్యే చంపిందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.