రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలో ఘోరం జరిగింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గేదె రెండు రోజుల క్రితం అదృశ్యం కావడంతో... దీన్ని ఎత్తుకుపోయిన వ్యక్తి మహేశ్వరం మండలం తుక్కుగూడలో విక్రయిస్తుండగా పట్టుకుని ఆదివారం సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల ముందు పంచాయతీ జరుగుతున్న సమయంలో నిందితుడ్ని స్థానికులు చితకబాదారు. దీంతో అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.