 
															జిల్లాను హరితవనంగా మార్చాలి
													 
										
					
					
					
																							
											
						 హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జిల్లాను హరితవనంగా మార్చాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
						 
										
					
					
																
	పెద్దఅడిశర్లపల్లి :  హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జిల్లాను హరితవనంగా మార్చాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పీఏపల్లి మండలం గుడిపల్లి, కేశంనేనిపల్లి గ్రామాల్లో  దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని పేర్కొన్నారు.  దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ  మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధర్మయ్య, ఎంపీడీఓ జావెద్‌అలీ, జెడ్పీటీసీ తేరా స్పందనరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తేరా గోవర్ధన్‌రెడ్డి, గుడిపల్లి సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, గుడిపల్లి ఎంపీటీసీ వడ్లపల్లి చంద్రారెడ్డి, కేశంనేనిపల్లి సర్పంచ్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, నాయకులు మారం కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.