జిల్లాను హరితవనంగా మార్చాలి
చింతపల్లి : నల్లగొండ జిల్లాను హరితవనంగా మార్చాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
చింతపల్లి : నల్లగొండ జిల్లాను హరితవనంగా మార్చాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో భాగంగా తమ ఇంటి పెరట్లలో, రోడ్డుకిరువైపులా, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి, జెడ్పీటీసీ హరినాయక్, మండల పార్టీ అధ్యక్షుడు గోపిడి కిష్టారెడ్డి, నాయకులు అంగిరేకుల నాగభూషణం, ముచ్చర్ల యాదగిరి, మాస భాస్కర్,అంగిరేకుల గోవర్ధన్, నర్సింహారెడ్డి, రియాజ్‌పాష, శ్రీనివాస్, నర్సింహ, గోవిందు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.