బతుకమ్మ పూల కోసం వెళ్లి వ్యక్తి మృతి | The death of a man who went for a floral Bathukamma | Sakshi
Sakshi News home page

బతుకమ్మ పూల కోసం వెళ్లి వ్యక్తి మృతి

Oct 9 2016 12:42 AM | Updated on Sep 4 2017 4:40 PM

బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలోని జవహర్‌నగర్‌లో శనివారం జరిగింది. స్థానికుడైన కుందె మల్లయ్య(42) ఇంట్లో బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకొచ్చేందుకు గండికుంట చెరువు వద్దకు పదకొండేళ్ల కుమారుడు నాగరాజుతో కలిసి శనివారం ఉదయం వెళ్లా డు. చెరువులోకి దిగి పూలను కోస్తున్న క్రమంలో లోతు అంచనా వేయకపోవ డంతో మునిగిపోయాడు.

  • తనయుడి కళ్లెదుటే 
  • తనువు చాలించిన తండ్రి
  • వెంకటాపురం : బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలోని జవహర్‌నగర్‌లో శనివారం జరిగింది. స్థానికుడైన కుందె మల్లయ్య(42) ఇంట్లో బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకొచ్చేందుకు గండికుంట చెరువు వద్దకు పదకొండేళ్ల కుమారుడు నాగరాజుతో కలిసి శనివారం ఉదయం వెళ్లా డు. చెరువులోకి దిగి పూలను కోస్తున్న క్రమంలో లోతు అంచనా వేయకపోవ డంతో మునిగిపోయాడు. ఆ సమయం లో కుమారుడు నాగరాజు కేకలు వేసినా సాయం చేసేందుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో రాలేదు. దీంతో మల్లయ్య పూర్తిగా మునిగిపోయాడు. ఆయన కుమారుడు నాగరాజు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు వెతకగా మల్లయ్య మృతదేహం లభించింది. మృతుడికి భార్య లక్షి్మతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement