బాలుడిని ప్రశ్నించిన పోలీసులు | The boy was questioned by the police | Sakshi
Sakshi News home page

బాలుడిని ప్రశ్నించిన పోలీసులు

Jul 26 2016 5:30 PM | Updated on Sep 4 2018 5:21 PM

టోలీచౌకిలోని ప్రామిసింగ్ కాన్సెప్ట్ హైస్కూల్‌లో మూడో తరగతి విద్యార్థి(8) ని మంగళవారం పోలీసులు ప్రశ్నించారు.

టోలీచౌకిలోని ప్రామిసింగ్ కాన్సెప్ట్ హైస్కూల్‌లో మూడో తరగతి విద్యార్థి(8) దాడిలో గాయపడి మృతి చెందిన ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు దాడి చేసిన బాలుడిని మంగళవారం ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా సదరు బాలుడు సరిగా సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో బాలుడిని జువైనల్ న్యాయ సలహాకేంద్రానికి తరలించారు. అక్కడి కమిటీ సిఫారసుల మేరకు బాలుడిని జువైనల్ హోంకు తరలించాలా..? తల్లిదండ్రులకు అప్పగించాలా? అన్నది నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement