ఇంటిస్థలం కోసం గొడ్డళ్లతో దాడి | The attack for the house space with axes | Sakshi
Sakshi News home page

ఇంటిస్థలం కోసం గొడ్డళ్లతో దాడి

Jul 4 2016 2:08 PM | Updated on Sep 4 2017 4:07 AM

ఇంటి స్థలం విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి పరస్పరం ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు.

ఇంటి స్థలం విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి పరస్పరం ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఇంటి స్థలానికి చెందిన అంశంలో గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement