కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ | Teacher suspension on sexual harrassment | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

Nov 26 2016 9:58 PM | Updated on Jul 23 2018 8:49 PM

విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ..

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్లపాలెం మండలం యాజలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏవీ బసవయ్య పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా గ్రామస్తులు  పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై బాపట్ల డీవైఈవో ఎన్‌.రఘుకుమార్‌ను విచారణ అధికారిగా నియమించిన డీఈవో డీవైఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement