
టీచర్.. అయ్యాడు 'మట్కా' చీటర్
పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పాల్సిన ఆయనే.. ప్రజలను పెడదోవ పట్టించే అక్రమ మట్కా దందా నిర్వహిస్తున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
- అనంతపురం జిల్లాలో మట్కా నిర్వహిస్తూ పట్టుపడ్డ ఉపాధ్యాయుడు
అనంతపురం: పవిత్రమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయుడు ఆయన. పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పాల్సిన ఆయనే.. ప్రజలను పెడదోవ పట్టించే అక్రమ మట్కా దందా నిర్వహిస్తున్నాడు. చివరికి అదే మట్కా నిర్వహిస్తూ శనివారం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అనంతపురం జిల్లా కళ్యానదుర్గంలో ఒక టీచర్ నిర్వకం ఇది.
పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో విస్తరించిన మట్కా జూదంపై ఇటీవలే దాడులు ప్రారంభించిన పోలీసులు.. కళ్యానదుర్గంలో అరస్టయిన ఉపాధ్యాయుడి నుంచి దాదాపు 16 లక్షల విలువైన మట్కా జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రస్తుతం కటకటాల్లో ఉన్న మట్కా టీచర్ ను విడిపించేందుకు తెలుగుదేశం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోన్న మట్కా దందా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నదని పెద్ద ఎత్తున ఆరోపణలున్న సంగతి తెలిసిందే.