వైఎస్ హయాంలోనే అభివృద్ధి : టీడీపీ నాయకుడు | tdp leader Admiring ysr in vizianagaram district | Sakshi
Sakshi News home page

వైఎస్ హయాంలోనే అభివృద్ధి : టీడీపీ నాయకుడు

Nov 16 2015 4:57 PM | Updated on Aug 10 2018 9:42 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే తమ గ్రామాలు అభివృద్ధి జరిగాయని విజయనగరం జిల్లా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్వర్ అన్నారు.

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే తమ గ్రామాలు అభివృద్ధి  చెందాయని విజయనగరం జిల్లా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు మండలం కూర్మరాజుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా పరమేశ్వర్ సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో రాజన్నదొర ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలోనే తమ గ్రామాభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరతోపాటు టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి నిధులు రావడం లేదన్నారు. పరమేశ్వర్ వ్యాఖ్యలతో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ సంధ్యారాణితో పాటు టీడీపీ నాయకులు మిన్నుకుండిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement