ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జన్మభూమి-మాఊరు సభల్లో అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
హిందూపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జన్మభూమి-మాఊరు సభల్లో అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదివారం పట్టణంలోని 25, 26, 27 వార్డుల్లో సభలు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగరోజు అందరూ సంతోషంగా ఉండాలని రేషన్‌కార్డుదారులకు చంద్రన్న కానుకలు అందిస్తున్నారన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిíస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం కొత్త రేషన్‌కార్డులు, చంద్రన్నకానుకల బ్యాగులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. వార్డుల్లోని సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయసాగారు.