టాటా మోటార్స్ షోరూం ప్రారంభం
రాంపూర్ వద్ద వరంగల్ – హైదరాబాద్ హైవేపై ఏర్పాటు చేసిన టాటా మోటార్స్ షోరూంను ఆదివారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆర్.టి.వాస¯ŒS ప్రారంభించారు.
-
48 గంటల్లో వాహనం రిపేర్ పూర్తి
-
అలా చేయలేకపోతే వినియోగదారుడికి అపరాధ రుసుము చెల్లింపు
-
టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.టి.వాస¯ŒS
రాంపూర్(ధర్మసాగర్ ) : రాంపూర్ వద్ద వరంగల్ – హైదరాబాద్ హైవేపై ఏర్పాటు చేసిన టాటా మోటార్స్ షోరూంను ఆదివారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆర్.టి.వాస¯ŒS ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన వినియోగదారులకు ఈ షోరూం ద్వారా సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. తమ బ్రాండ్‌కు చెందిన అన్ని మోడళ్ల ఆటో కమర్షియల్, కమర్షియల్ వెహికిల్స్ సేల్స్, సర్వీస్, స్పేర్‌పార్ట్‌్సకు సంబంధించిన సేవలను 24 గంటలు అందిస్తామన్నారు. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లో వాహనం ఉన్నచోటికి సంస్థ ప్రతినిధులు చేరుకుని రిపేర్ చేస్తారని తెలిపారు. రిపేర్ కోసం షోరూంకు తరలించిన వాహనాన్ని 48 గంటల్లో బాగు చేసి, వినియోగదారుడికి అప్పగిస్తామన్నారు. ఒకవేళ అలా చేయలేకపోతే కస్టమర్‌కు అపరాధ రుసుమును సైతం కంపెనీ ద్వారా చెల్లిస్తామని ఆర్.టి.వాస¯ŒS వెల్లడించారు.
అనంతరం టాటామోటార్స్ అధీకృత డీలర్ గీతా ఆటో కమర్షియల్ మేనేజింగ్ పార్ట్‌నర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ టాటా మోటార్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ షోరూంతో ఒకే పాయింట్ వద్ద అన్ని రకాల సేవలను వినియోగదారులు పొందొచ్చన్నారు. కార్యక్రమంలో టాటామోటార్స్ సౌత్‌జో¯ŒS సేల్స్ రీజినల్ మేనేజర్ పి.రాయ్, కస్టమర్ ఆర్‌ఎం అరుణ్ జలాలీ, ప్రశాంత్ ఫడ్నవిస్, తదితరులు పాల్గొన్నారు.