విప్లవవీరుడు, తెల్లదొరలపాలిట సింహాస్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించేందుకు చెన్నై నుంచి ఉయ్యాలవాడకు ప్రత్యేక బృందం బుధవారం రానుంది.
రేపు తమిళనాడు బృందం రాక
May 8 2017 11:31 PM | Updated on Sep 19 2019 8:25 PM
	 – ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించేందుకు పర్యటన
	 
					
					
					
					
						
					          			
						
				
	కోవెలకుంట్ల: విప్లవవీరుడు, తెల్లదొరలపాలిట సింహాస్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించేందుకు  చెన్నై నుంచి ఉయ్యాలవాడకు ప్రత్యేక బృందం బుధవారం  రానుంది. ఈ సందర్భంగా సోమవారం  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగుభాష పరిరక్షణ వేదిక కన్వీనర్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఫోన్‌ద్వారా మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో తెల్లదొరలపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన మొట్టమొదటి వీరున్ని స్మరించుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. చెన్నై నుంచి తమ కార్యవర్గంతో ఉయ్యాలవాడకు చేరుకుని నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామన్నారు. అనంతరం  నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో సమావేశమవుతామనా్నరు.  రాబోయే రోజుల్లో ఉయ్యాలవాడ చరిత్ర, ఆయన వీరత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
