సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
భువనగిరి అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్యసిబ్బంది స్పందించి గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ కె.భానుప్రసాద్‌నాయక్ అన్నారు.
భువనగిరి అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్యసిబ్బంది స్పందించి గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ కె.భానుప్రసాద్‌నాయక్ అన్నారు. భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయ భవనం ఏర్పాటు కోసం మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి సమీపంలో ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లేరియా వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డెంగీ లక్షణాలు గుర్చి గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలని, మనుషులు నల్లగా మారడం, తరుచు జ్వరాలు రావడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స చేయించుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీ వరకు భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా డీఎంహెచ్‌ఓ–1, ఏడీఎంహెచ్‌ఓ–1, డీఐఓ–1. డీటీసీఓ–1, డీఎల్‌ఓ–1, మల్లేరియా డీఎంఓ–2, ఎస్‌ఓ–1, ఐడీఎస్‌పీ మేడికల్ అధికారి–1, సూపరింటెండెంట్–1, సీనియర్ అసిస్టెంటు–3, జూనియర్–5, డ్రైవర్లు–5, అంటెండర్లు–5 పోస్టులలో అధికారులు, సిబ్బంది రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎండీ.అన్వర్‌హుస్సేన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీకాంత్ ఉన్నారు.