గబ్బిలాలకు వేసవి సెగ | Sakshi
Sakshi News home page

గబ్బిలాలకు వేసవి సెగ

Published Fri, Apr 28 2017 11:41 PM

గబ్బిలాలకు వేసవి సెగ

పెరిగిపోయిన వేసవి ఉష్ణోగ్రత మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం బలిగొంటోంది. వడదెబ్బ కారణంగా ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో తుమ్మలపెంట శివాలయం వద్ద చింత చెట్లపై వందల ఏళ్ల నుంచి వేల సంఖ్యలో నివాసం ఉంటున్న గబ్బిలాలు ఎండ వేడిమికి విలవిల్లాడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతుండడంతో వేడికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 40కి పైగానే మరణించాయి. గ్రామంతో అనుబంధం పెంచుకున్న గబ్బిలాలు, వాటి సంతతి ఎండదాటికి అంతరించిపోతుండడాన్ని  తుమ్మలపెంట వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.                       
                                                                                       - కొలిమిగుండ్ల 
 

Advertisement
Advertisement