అద్భుతాల ‘లేపాక్షి’

అద్భుతాల ‘లేపాక్షి’


శిల్ప కళలకు కాణాచిగా మారిన జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం లేపాక్షిలో అడుగడుగునా అద్భుతాలే కనిపిస్తుంటాయి. ఇందులో తైలవర్ణ చిత్రాలు ప్రముఖమైనవి. ఆలయంలోని నాట్య మంటపానికి తూర్పున పైకప్పులో ఒక రావి ఆకుపై చిన్నికృష్ణుడు పడుకున్నట్లున్న చిత్రపటం దేశవిదేశీ పర్యాకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో విశేషమేమంటే మనం ఎటు వైపు నుంచి చూసినా.. చిన్నికృష్ణుడు మనలే​‍్న చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకా నాట్య మంటపంలో అంతరిక్ష స్తంభం, రంభ నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం, సంగీత కళాకారులు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి అలంకరణలు, విరుపణ్ణ అన్నదమ్ముల చిత్రాలు.. అబ్బుర పరుస్తుంటాయి.

- లేపాక్షి (హిందూపురం)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top