చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి | sugar cane , mango garden destroyed by fire | Sakshi
Sakshi News home page

చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి

May 4 2016 5:45 PM | Updated on Oct 16 2018 3:12 PM

ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి.

ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. సర్ధన గ్రామానికి చెందిన నారా గౌడ్‌కు గ్రామ శివారులో 5 ఎకరాల మామిడి తోట ఉంది. పక్కనేగల కొండు కిష్టయ్య 9 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో మంటలు అంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ క్రమంలో మంటలు పక్కనే గల చెరుకుతోటలోకి వ్యాపించాయి. దీంతో చెరుకుతోట సైతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో మామిడి చెట్లు కాలి రూ.10 లక్షల మేర, చెరుకుతోటకు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితరైతులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement