శాంతి ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం | success The Peace Protest | Sakshi
Sakshi News home page

శాంతి ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం

Aug 27 2016 6:21 PM | Updated on Sep 4 2017 11:10 AM

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

ఊట్కూర్‌ : శాంతి మానవత ఉద్యమాన్ని విజయవంతం చేద్దామని జమాతే ఇస్లామీ హింద్‌ మండల అధ్యక్షుడు కల్వాల్‌ ఖాలిక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21నుంచి సెప్టెంబర్‌ 4 వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో శాంతి మానవత ఉద్యమం చేపపట్టనున్నట్లు తెలిపారు.

ఊట్కూర్‌ : శాంతి మానవత ఉద్యమాన్ని విజయవంతం చేద్దామని జమాతే ఇస్లామీ హింద్‌ మండల అధ్యక్షుడు కల్వాల్‌ ఖాలిక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21నుంచి సెప్టెంబర్‌ 4 వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో శాంతి మానవత ఉద్యమం చేపపట్టనున్నట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అన్నారు. నేడు కొందరు సంఘవిద్రోహ శక్తులు తమ స్వార్థంకోసం సమాజంలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సమాజంలో శాంతికోసం అందరూ సమైక్యంగా ఉద్యమించాలని కోరారు. అనంతరం గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఐహెచ్‌ ప్రచార కార్యదర్శి జావిద్, ఎస్‌ఐఒ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement