కిడ్నీ వ్యాధులపై కేజీహెచ్‌ వైద్యుల అధ్యయనం | Sakshi
Sakshi News home page

కిడ్నీ వ్యాధులపై కేజీహెచ్‌ వైద్యుల అధ్యయనం

Published Fri, Sep 23 2016 11:32 PM

బొరివంక ఆస్పత్రిలో కిడ్నీవ్యాధిగ్రస్తుడిని పరీక్షిస్తున్న నెఫ్రాలజిస్టు భాస్కర్‌

కవిటి: ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తిపై విశాఖపట్నం కేజీహెచ్‌ వైద్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. కవిటి మండలం బొరివంక పీహెచ్‌సీలో కేజీహెచ్‌ నెఫ్రాలజీ విభాగం నిపుణులు డాక్టర్‌ బి.భాస్కర్, కమ్యూనిటీ సర్వీసెస్‌ విభాగం సహాయక సిబ్బంది క్రాంతి, సురేంద్రలు కిడ్నీరోగులను పరీక్షించారు.

వ్యాధి వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల ఆహారపు అలవాట్లను తెలుసుకున్నారు. రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. కేజీహెచ్‌ వైద్యులకు స్థానిక వైద్యులు భాస్కర్, రాకేష్కుమార్‌లు సహకరించారు. స్థానికSసర్పంచ్‌ శ్రీరాంప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు బెందాళం విజయకృష్ణ, హాస్పిటల్‌ డెవెలెప్‌మెంట్‌కమిటీ అధ్యక్షుడు పండి శ్రీనివాస్, సభ్యుడు జయప్రకాష్, ఉద్దానం యూత్‌క్లబ్‌ ఆఫ్‌ బొరివంక అధ్యక్ష, కార్యదర్శులు దుద్ది సతీస్, లొట్ల దీనబంధు తదితరులు హాజరై ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తిపై పలు అంశాలను వైద్య బృందానికి తెలియజేశారు.

 

Advertisement
Advertisement