చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి | study and society development | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి

Aug 16 2016 9:05 PM | Updated on Jul 26 2019 4:10 PM

చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి - Sakshi

చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి

చదువుతోపాటు సమాజాభివృద్ధికి కూడా విద్యార్థులు పాటుపడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక బీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో నన్నయ వర్సిటీ, వికాస సంయుక్త ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏటా చదువు పూర్తి చేసుకునే 30 మంది విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా క్యాంపస్‌ ఇంటర్వూ్యలు నిర్

  • విద్యార్థులకు ‘నన్నయ’ వీసీ పిలుపు
రంపచోడవరం : 
చదువుతోపాటు సమాజాభివృద్ధికి కూడా విద్యార్థులు పాటుపడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక బీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో నన్నయ వర్సిటీ, వికాస సంయుక్త ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏటా చదువు పూర్తి చేసుకునే 30 మంది విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా క్యాంపస్‌ ఇంటర్వూ్యలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. వర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి కేంద్రాలు 20 ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ పరిధిలో 450 డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. విద్యార్థులు పూర్తి చేసిన డిగ్రీకి అనుబంధంగా అదనపు  నైపుణ్యాలను అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, తమలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలని వీసీ సూచించారు. వికాస ప్రాజెక్టు అధికారి వీఎన్‌ రావు, నన్నయ ఎడ్యుకేషన్‌ మెంబర్‌ బి.సువర్ణకుమార్‌ కూడా ప్రసంగించారు. వీసీని లెనోరా విద్యాసంస్థ ఆధ్వర్యాన ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో లెనోరా విద్యాసంస్థ అధినేత డాక్టర్‌ బి.రత్నం, వర్సిటీ ప్లేస్‌మెంట్‌ అధికారి డాక్టర్‌ బి.జగన్‌మోహన్‌రెడ్డి, వికాస ప్లేస్‌మెంట్‌ అధికారులు పి.శ్రీకాంత్, కౌముది, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాస్, లెనోరా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కిరణ్‌మూర్తి, సర్పంచ్‌ వై.నిరంజనీదేవి, బీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement