breaking news
nanayya vc
-
త్రిమూర్తుల కన్నా గొప్పవాడు గురువు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ప్రతి విద్యార్థి జీవితంలో గురువు ముఖ్య పాత్ర వహిస్తారని, త్రిమూర్తులు కన్నా ఆయన గొప్పవాడని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలునాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక రివర్‌బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో శ్రీమతి జాస్తిబుల్లెమ్మాయి డిగ్రీ కళాళాల ఫ్రెషర్స్‌డే ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ అమ్మాయిలు ఆత్మ విశ్వాçÜం కలిగి ఉండాలని, పీటీ ఉష, ఇందిరాగాంధీ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జాస్తి జనార్థనమూర్తి కళాశాల ప్రగతిని వివరించారు. మిస్ బుల్లెమ్మాయి పోటీలో గెలుపొందిన తేజస్వికి, వివిధ సాంస్కృతిక క్రీడల్లో పాల్గొన్న వారికి, రచనా వ్యాసంగంలోను గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. కరస్పాండెంట్ జాస్తి జనార్దనమూర్తి వీసీని శాలువాతో ఘనంగా సత్కరించారు. లెఫ్టినెంట్ జాస్తి మూర్తి, జేవీ శేషగిరి, కళాశాల కోశాధికారి కె.సత్యవతి, కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్ రమాదేవి, కోమలాదేవి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.విద్యార్థినులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. విద్యార్థినులు చేసిన స్టెప్పులు కేక పెట్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రెషర్స్‌డే సాగింది. -
చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి
విద్యార్థులకు ‘నన్నయ’ వీసీ పిలుపు రంపచోడవరం : చదువుతోపాటు సమాజాభివృద్ధికి కూడా విద్యార్థులు పాటుపడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక బీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నన్నయ వర్సిటీ, వికాస సంయుక్త ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏటా చదువు పూర్తి చేసుకునే 30 మంది విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. వర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి కేంద్రాలు 20 ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ పరిధిలో 450 డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. విద్యార్థులు పూర్తి చేసిన డిగ్రీకి అనుబంధంగా అదనపు నైపుణ్యాలను అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, తమలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలని వీసీ సూచించారు. వికాస ప్రాజెక్టు అధికారి వీఎన్ రావు, నన్నయ ఎడ్యుకేషన్ మెంబర్ బి.సువర్ణకుమార్ కూడా ప్రసంగించారు. వీసీని లెనోరా విద్యాసంస్థ ఆధ్వర్యాన ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో లెనోరా విద్యాసంస్థ అధినేత డాక్టర్ బి.రత్నం, వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, వికాస ప్లేస్మెంట్ అధికారులు పి.శ్రీకాంత్, కౌముది, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్, లెనోరా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్‌మూర్తి, సర్పంచ్ వై.నిరంజనీదేవి, బీఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.