పాముకాటుతో విద్యార్థి మృతి | student dies of snake byte | Sakshi
Sakshi News home page

పాముకాటుతో విద్యార్థి మృతి

Sep 7 2017 9:38 PM | Updated on Nov 9 2018 4:36 PM

పాముకాటుతో విద్యార్థి మృతి - Sakshi

పాముకాటుతో విద్యార్థి మృతి

మండల పరిధిలోని క్రిష్ణాపురంలో గురువారం పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన జరిగింది.

గార్లదిన్నె: మండల పరిధిలోని క్రిష్ణాపురంలో గురువారం పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన జరిగింది. 108 సిబ్బంది, వైద్య సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు పట్ర సూరి అనే వ్యక్తి కుమారుడు ప్రసాద్‌ (9) అనే విద్యార్థి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అయితే గురువారం తెల్లవారు జామున  ప్రసాద్‌ నోట్లో నురుగు వస్తుండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించగా అనంతపురము ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడన్నారు. పాము కాటుకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ గోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డిలు విద్యార్థి మృతదేహన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement