ఐడియా 3జీ సేవలు ప్రారంభం | Started Idea 3G Service | Sakshi
Sakshi News home page

ఐడియా 3జీ సేవలు ప్రారంభం

Jul 23 2016 5:48 PM | Updated on Sep 4 2017 5:54 AM

కేక్‌ కట్‌చేసి 3జీ సేవలను ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ సైదులు

కేక్‌ కట్‌చేసి 3జీ సేవలను ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ సైదులు

ఉప్పునుంతల : మండల కేంద్రంలో శనివారం ఐడియా 3జీ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహసీల్దార్‌ సైదులు కేక్‌ను కట్‌చేసి సేవలు ప్రారంభించారు.

ఉప్పునుంతల : మండల కేంద్రంలో శనివారం ఐడియా 3జీ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహసీల్దార్‌ సైదులు కేక్‌ను కట్‌చేసి సేవలు ప్రారంభించారు. ఐడియా డిస్ట్రిబ్యూటర్లు, వినియోగదారులు గ్రామంలో బైక్‌ర్యాలీ నిర్వహించి, టపాకాయలు కాల్చుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఐడియా ఏఎస్‌ఎమ్‌ జగనాథంనాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ఐడియా వినియోగదారులకు మరింత మెరుగైన ఇంటర్‌నెట్‌ సేవలను అందుబాటులో తేవడానికి 3జీ హైస్వీడ్‌ నెట్‌వర్క్‌ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని బొమ్మన్‌పల్లి, అమ్రాబాద్, లింగాల, మన్ననూర్‌లలో కూడా 3జీ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐడియా టీఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, డిస్టిబ్యూటర్లు సాయిరాం, శ్రీనివాస్, రమేష్‌గౌడ్, విజయభాస్కర్‌లు, వినియోగదారులు సూరం ప్రశాంత్‌రెడ్డి, గణేష్‌గౌడ్, నరేష్, అచ్యుతారెడ్డి పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement