శ్రీశైలం సబ్ ట్రెజరీ అధికారిణి నాగసవిత ఆచూకీ లభించింది.
శ్రీశైలం ఎస్‌టీఓ ఆచూకీ లభ్యం
May 9 2017 10:56 PM | Updated on Sep 27 2018 5:46 PM
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలం సబ్ ట్రెజరీ అధికారిణి నాగసవిత ఆచూకీ లభించింది. వారం రోజుల క్రితం ఈమె అదృశ్యమయ్యింది. ఈ మేరకు పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. నిజాయితీగా పనిచేస్తున్న తన మీద అభియోగాలు నమోదు కావడం, డైరెక్టర్ చార్జిమెమో జారీ చేసినందుకు మనస్తాపం చెందిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజులుగా దళిత ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. ట్రెజరీ ఏడీ వేధింపులే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఆమె తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం. బుధవారం కర్నూలుకు తీసుకురానున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement