భార్యను వేధిస్తున్నాడని హతమర్చాడు.. | srinivas murdered in woman harrasment incident | Sakshi
Sakshi News home page

భార్యను వేధిస్తున్నాడని హతమర్చాడు..

Sep 24 2015 7:04 PM | Updated on Sep 3 2017 9:54 AM

భార్యను వేధిస్తున్నాడని హతమర్చాడు..

భార్యను వేధిస్తున్నాడని హతమర్చాడు..

ఓ వివాహితను వేధిస్తున్న దుండగుడు, ఆమె భర్త చేతిలోనే చివరికి హతమయ్యాడు.

కాశీపేట(ఆదిలాబాద్): ఓ వివాహితను వేధిస్తున్న దుండగుడు, ఆమె భర్త చేతిలోనే చివరికి హతమయ్యాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కాశీపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. కాశీపేట మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి భార్యను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త, ఆవేశంతో శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement