దొంగతనానికి పోయి.. ప్రాణాలో కోల్పోయాడు | srinivas died while he went for robbery in ricemill | Sakshi
Sakshi News home page

దొంగతనానికి పోయి.. ప్రాణాలో కోల్పోయాడు

Sep 20 2015 9:59 PM | Updated on Aug 30 2018 5:27 PM

రైస్‌మిల్‌లోకి దొంగతనం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు కిటికీలో నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా..

నిజామాబాద్(వర్ని): రైస్‌మిల్‌లోకి దొంగతనం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు కిటికీలో నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా..అందులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతిచెందిన సంఘటన వర్ని మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వర్ని మండలం సేవాలాల్‌తాండాకు చెందిన యువకుడు శ్రీనివాస్ తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మండల కేంద్రంలోని ఓరైస్‌మిల్‌లోకి దొంగతనానికి వెళ్లాడు.

ఓవైపు నుంచి వెళ్లాల్సి ఉండగా..తాగిన మైకంలో మరోవైపు ఉన్న కిటికీలో నుంచి దూరేందుకు యత్నించాడు. అందులో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం అటు నుంచి వెళ్లిన కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికిచేరుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement