ప్రత్యేక హోదా కోసం ఎస్టీయూ నిరసన | spl status agitation | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం ఎస్టీయూ నిరసన

Jul 31 2016 8:21 PM | Updated on Sep 4 2017 7:13 AM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుపర్చేందుయు నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం, హోదా కోసం పోరాటం చేయని టీడీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని శంకర్‌విలాస్‌ సెంటర్‌ నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకూ ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుధీర్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ, విభజన హామీలు, ఉద్యోగ అవకాశాల కల్పనకు, రాష్ట్ర ప్రగతికై పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 2న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్ధతు ప్రకటిస్తున్నట్లు సుధీర్‌ బాబు ప్రకటించారు. అనంతరం బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌. రామచంద్రయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement