ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) వారి ద్వారా నిరుద్యోగ యువకులకు ల్యాండ్ సర్వే, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో మూడునెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఈడీ సర్వయ్య, న్యాక్ ఏడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
Aug 6 2016 11:44 PM | Updated on Sep 15 2018 3:01 PM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) వారి ద్వారా నిరుద్యోగ యువకులకు ల్యాండ్ సర్వే, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో మూడునెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఈడీ సర్వయ్య, న్యాక్ ఏడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్, ఐటీఐ(సివిల్/ఎలక్ట్రిషియన్) చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు 18 నుంచి 35ఏళ్ల మధ్య వయస్కులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు డ్వామా ఆఫీసు క్యాంపస్‌లోని నాక్ కార్యాలయాన్ని సంప్రదించాలని, వివరాలకు 9440683583 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement