నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్‌’ బృందాలు | special partys for combing in nalamala | Sakshi
Sakshi News home page

నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్‌’ బృందాలు

Oct 28 2016 9:03 PM | Updated on Sep 4 2017 6:35 PM

నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్‌’ బృందాలు

నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్‌’ బృందాలు

నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ కోసం స్పెషల్‌ పార్టీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు.

కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ కోసం స్పెషల్‌ పార్టీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో సివిల్‌ , ఏఆర్‌ సిబ్బంది నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రానికి పిలిపించి వారి వయస్సు, వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ కోసం స్పెషల్‌ పార్టీ బృందాలుగా వారిని ఏర్పరిచి.. ఫిట్‌నెస్‌ కోసం మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్‌ఐలు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వీవీఐపీల కదలికల సమాచారాలను యూనిట్‌ ఆఫీసర్లకు అందించాలన్నారు. వీఐపీలకు రక్షణ కల్పించాలన్నారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒబేసిటీ తరగతులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, వెంకటాద్రి, సీఐలు నాగరాజురావు, మధుసూదన్‌రావు, ఆర్‌ఐలు జార్జ్, రంగముని, రామకృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement