నేటి నుంచి లయోలాలో ‘స్పందన’ | spandana @ layola college | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లయోలాలో ‘స్పందన’

Oct 6 2016 11:29 PM | Updated on Sep 4 2017 4:25 PM

నేటి నుంచి లయోలాలో ‘స్పందన’

నేటి నుంచి లయోలాలో ‘స్పందన’

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో దాగిఉన్న సృ జనాత్మతను వెలికితీసేందుకు ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపల్‌ ఫాదర్‌ జీపీఏ కిషోర్‌lచెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

 
విజయవాడ(గుణదల):  ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో దాగిఉన్న సృ జనాత్మతను వెలికితీసేందుకు ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపల్‌ ఫాదర్‌ జీపీఏ కిషోర్‌lచెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో 17 ఈవెంట్లలో 11 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పాల్గొంటున్నారని లె లిపారు. 8వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు సినీడైరెక్టర్, నటుడు ఎం.నరేష్‌కుమార్‌ హాజరవుతారని తెలిపారు. అనంతరం ఆయన స్పందన–2016 బ్రోచర్‌ను విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌ విభాగం ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ చిన్నప్ప అధ్యాపకులు కృష్ణార్జున, నిర్మలకుమారి, ఎలీషా పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement