శ్రీశైలంలో స్వల్పంగా విద్యుదుత్పత్తి | slightly power generation in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో స్వల్పంగా విద్యుదుత్పత్తి

Mar 7 2017 12:55 AM | Updated on Oct 19 2018 7:19 PM

కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో స్వల్పంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు: కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో స్వల్పంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. లోడ్‌ డిశ్పాచ్‌ ఆదేశాల మేరకు డిమాండ్‌ను అనుసరించి పీక్‌లోడ్‌ అవర్స్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 0.526 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1.284 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పతి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 3,324 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయ పరిసర ప్రాంతాలలో పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36.25 డిగ్రీలకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో 346 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్‌ సిబ్బంది తెలిపారు. సోమవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 41.0482 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 820.30 అడుగులకు చేరుకుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement