
సివిల్ సప్లై గోదాంను తనిఖీ చేసిన పీడీ
మండలంలోని సివిల్ సప్లై గోదాంను డ్వామా పీడీ ఆర్.కూర్మనాధం ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. వాస్తవంగా జాయింట్ కలెక్టర్ గోదాంను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆయన లేకపోవడంతో కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆదేశాలతో సివిల్ సప్లై గోదాంను తనిఖీలు చేస్తున్నామని కూర్మనాధం విలేకరులకు తెలిపారు.