అది సరే.. టీచర్లు ఎక్కడ? | schools level ok.. no staff | Sakshi
Sakshi News home page

అది సరే.. టీచర్లు ఎక్కడ?

Nov 13 2016 9:44 PM | Updated on Sep 15 2018 7:22 PM

ప్రభుత్వ పాఠశాలలకు అదనంగా ఎనిమిదో తరగతి కేటాయించడంతో గ్రామస్తులు సంబరపడ్డారు. తమ పిల్లలను ఈ ఏడాది కూడా ఇక్కడే చదివించవచ్చని ఆనందించారు. తీరా.. పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించలేదు సరికదా, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

  • స్థాయి పెంచి.. సౌకర్యాల కల్పన మరిచారు
  • 184 పాఠశాలల్లో ఎనిమిదో తరగతి ప్రారంభం
  • రెండేళ్లుగా జరగని ఉపాధ్యాయుల కేటాయింపు
  • ప్రభుత్వ పాఠశాలలకు అదనంగా ఎనిమిదో తరగతి కేటాయించడంతో గ్రామస్తులు సంబరపడ్డారు. తమ పిల్లలను ఈ ఏడాది కూడా ఇక్కడే చదివించవచ్చని ఆనందించారు. తీరా.. పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించలేదు సరికదా, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

    – రాయవరం

    జిల్లాలో 2014 జూ¯ŒS నుంచి హడావిడిగా 184 ప్రాథమికోన్నత పాఠశాలల్లో అదనంగా ఎనిమిదో తరగతిని ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రెండేళ్ల క్రితం ఎస్‌ఎస్‌ఏ హడావిడిగా అమలు చేసింది. పాఠశాలలకు ఉపాధ్యాయులను, మౌలిక సదుపాయాలను కల్పించకుండానే.. అదనంగా ఎనిమిదో తరగతిని హడావిడిగా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం ఒనగూరలేదు.
    సబ్జెక్టు టీచర్లు లేకుండానే..
    ప్రాథమికోన్నత పాఠశాలకు నిబంధనల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు నాలుగు ఉండాలి. గణితం, సై¯Œ్స, తెలుగు, ఇంగ్లిష్, హిందీ  స్కూల్‌ అసిస్టెంట్లను నియమించాల్సి ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లను నియమించాలి. అప్‌గ్రేడ్‌ చేసిన చాలా పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కేటాయించలేదు. పాఠశాలను ఎనిమిదో తరగతికి అప్‌గ్రేడ్‌ చేసినా, ఎస్‌జీటీలతోనే నిర్వహిస్తున్నారు. అప్‌గ్రేడ్‌ చేయడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఉపాధ్యాయులను నియమించడంపై లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు లేకుండా, తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలను ఎలా నిర్వహిస్తారనే విషయం సందిగ్ధంగానే ఉంది. ఉదాహరణకు.. రాయవరం మండలంలోని కురకాళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎనిమిదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసినా, ఇప్పటివరకూ స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టు ఒక్కటీ మంజూరు కాలేదు. కేవలం నలుగురు ఎస్‌జీటీలతో ప్రాథమికోన్నత పాఠశాలను నిర్వహిస్తున్నారు.
    నలుగురితో నెట్టుకొస్తున్నాం..
    మా పాఠశాలను ఎనిమిదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
    – టి.సూరిబాబు, హెచ్‌ఎం, ఎంపీపీ యూపీ స్కూల్, కురకాళ్లపల్లి
    ఆరు ఎస్‌ఏ పోస్టులు ఉండాలి
    ప్రాథమికోన్నత పాఠశాలలకు ఆరు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండాలి. వెంటనే ప్రభుత్వం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు చేయాలి.
    – టీవీ కామేశ్వరరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌
    చదువులు ఎలా వస్తాయి?
    సబ్జెక్టు టీచర్లు లేకుండా చదువులెలా వస్తాయి. ఈ విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదు. వెంటనే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
    – పి.సుబ్బరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ
    మెరుగైన విద్య ఎలా సాధ్యం?
    సరైన సౌకర్యాలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకుండా మెరుగైన విద్యాబోధన ఎలా సాధ్యమవుతుంది. సబ్జెక్టు టీచర్ల నియామకంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేయాలి.
    – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement