స్కూల్‌ ప్రాజెక్ట్‌లో క్యూట్‌ సైంటిస్ట్‌! | Eniola Shokunbi: Middle Schoolers Air Filter Design Earns | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ప్రాజెక్ట్‌లో క్యూట్‌ సైంటిస్ట్‌!

Nov 2 2025 9:48 AM | Updated on Nov 2 2025 9:48 AM

Eniola Shokunbi: Middle Schoolers Air Filter Design Earns

ఐదో తరగతి విద్యార్థుల సైన్స్‌ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా రంగురంగుల పేపర్లు, కార్డ్‌బోర్డ్, గ్లూ, పెద్దగా రాసిన టైటిల్‌ కార్డ్స్‌తో వోల్కేనో మోడల్‌ లేదా సోలోర్‌ సిస్టమ్‌ మోడల్‌ చేస్తారు. కాని, అమెరికాలోని మిడ్‌టౌన్‌ పట్టణంలో చదువుతున్న 12 ఏళ్ల ఎనియోలా షోకుబ్ని చేసిన సైన్స్‌ ప్రాజెక్ట్‌ అందరినీ ఆశ్చర్యపరచింది. తన ప్రాజెక్ట్‌ కోసం ఆమె ఎంచుకున్నది జీవితానికి ఉపయోగపడే, సూపర్‌ ఇన్నోవేటివ్‌ ఐడియా. లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలల వాయు భద్రతను మెరుగుపరచడం కోసం, టీచర్‌ ఇచ్చిన సూచనలతో అందరికీ స్వచ్ఛమైన గాలి అందేలా చేయాలనుకుంది. 

అందుకోసం, ఒక ప్రాక్టికల్‌ సొల్యూషన్‌ రూపొందించింది. కేవలం అరవై డాలర్ల ఖర్చుతో, ఒక చిన్న బాక్స్, ఫ్యాన్, ఫిల్టర్లు, డక్ట్‌ టేప్, కార్ట్‌బోర్డ్‌లతో ఎయిర్‌ ప్యూరిఫైర్‌ నమూనా తయారుచేసి, కమర్షియల్‌ ప్యూరిఫైర్స్‌కు అత్యంత చౌకైన ప్రత్యామ్నాయం చూపింది. ఈ ఎయిర్‌ ఫిల్టర్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌ సైంటిస్టులు పరీక్షించారు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. 

గాలిలో ఉన్న వైరస్‌లను తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ తొలగించే సామర్థ్యం దీనికి ఉందని తేల్చి, డిజైన్‌ను సర్టిఫై చేశారు. అందుకే, ఈ చిన్నారి ఐడియా, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌గా మారింది. కనెక్టికట్‌ ప్రభుత్వం 11.5 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.101 కోట్లు) నిధిని మంజూరు చేసి, ఈ ఫిల్టర్‌లను అన్ని పబ్లిక్‌ స్కూళ్లలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా, త్వరలోనే ప్రతి తరగతి గది పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలి పొందనుంది.  

(చదవండి: వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement