రండి.. పెనునిద్దుర వదిలిద్దాం | Save people from Open manholes | Sakshi
Sakshi News home page

రండి.. పెనునిద్దుర వదిలిద్దాం

Oct 29 2015 2:28 PM | Updated on Jun 4 2019 5:16 PM

రండి.. పెనునిద్దుర వదిలిద్దాం - Sakshi

రండి.. పెనునిద్దుర వదిలిద్దాం

మూతల్లేని మ్యాన్‌హోల్స్, కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్‌లు, పూడ్చకుండా వదిలేసిన బోరు బావులు...

ప్రజల్ని మింగుతున్న రాకాసి నోళ్లను మూయిద్దాం
మూతల్లేని మ్యాన్‌హోళ్లు, కాపలా లేని క్రాసింగులపై యుద్ధం చేద్దాం
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేద్దాం
మీకు అండగా ‘సాక్షి’ నడుస్తుంది

 
సాక్షి, హైదరాబాద్: మూతల్లేని మ్యాన్‌హోల్స్, కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్‌లు, పూడ్చకుండా వదిలేసిన బోరు బావులు, రోడ్ల పక్కన ఎలాంటి రక్షణ లేకుండా నిర్మించిన వరద, మురుగునీటి కాల్వలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. చినుకుపడితే చాలు చెరువులను తలపించే రోడ్లపై వాహనదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. పాదచారులు మ్యాన్‌హోల్స్‌లో పడి కొట్టుకుపోతున్నారు. ఇటీవలే విశాఖలో నాలాలో పడిపోయిన చిన్నారి అదితి వారం తర్వాత శవమై కనిపించిన ఘటన అందర్నీ కలిచివేసింది.
 
 మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద కాపాలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు మరణించిన విషాదం ఇంకా గుండెల్ని మెలిపెడుతూనే ఉంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచెర్లలో బోరుబావులో పడి శివ మరణించిన వైనం కళ్ల ముందే కదలాడుతోంది. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే అధికారులు, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని వెక్కిరించే అనేక ఉదంతాలు! చలనం లేని ఈ అధికార వ్యవస్థను కదలించేందుకు ఓ అడుగు ముందుకు వేయండి.. మీతో ‘సాక్షి’ వేల అడుగులు వేస్తుంది. 
 మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ పరిసరాల్లో ఉన్న ప్రమాదకర మ్యాన్‌హోళ్లు, బోరుబావులు, రైల్వే క్రాసింగ్స్ ఫోటోలను, వీడియోలను ‘సాక్షి’కి పంపించండి. వీలైతే అక్షర రూపం ఇవ్వండి. మీ వేదనను, బాధను మాకు రాసి పంపండి. ఊరువాడా, పల్లె, పట్నం ఎక్కడ మీకు సమస్య  కనిపించినా తక్షణమే స్పందించి మాకు పంపించండి. జిల్లా పేజీల్లో ప్రముఖంగా ప్రచురిస్తాం.
 
దిగువన పేర్కొన్న చిరునామాకు పంపించండి..
 ఫోటోలు, వీడియోలను www.sakshiwar @gmail.com మెయిల్ చేయండి..
 వాట్సప్‌లో అయితే ఫోటోలు, వీడియోలను 9010882244 కూ పంపవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement