అయేషా మీరా కేసులో ఎనిమిదిన్నర ఏళ్లు జైలులో ఉన్న సత్యంబాబు ఆదివారం ఉత్కంఠ వాతావరణంలో సెంట్రల్‌జైలు నుంచి విడుదల అయ్యారు. బరువెక్కిన గుండెలతో కన్నీటి పర్యంతం అవుతూ అతను చెబుతున్న సంఘటనలు జైలు వద్దకు వచ్చిన వారి
జైలు నుంచి సత్యంబాబు విడుదల
Apr 2 2017 11:29 PM | Updated on Sep 5 2017 7:46 AM
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) :
అయేషా మీరా కేసులో ఎనిమిదిన్నర ఏళ్లు జైలులో ఉన్న సత్యంబాబు ఆదివారం ఉత్కంఠ వాతావరణంలో సెంట్రల్‌జైలు నుంచి విడుదల అయ్యారు. బరువెక్కిన గుండెలతో కన్నీటి పర్యంతం అవుతూ అతను చెబుతున్న సంఘటనలు జైలు వద్దకు వచ్చిన వారి హృదయాలను కదించాయి. పోలీసుల చిత్రహింసలకు కొంతకాలం నడవలేకపోయానని, జైలులో ఉండగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యం కుదుట పడిన తరువాత స్టీల్ వర్కుషాపులో పని చేస్తూ కొంత సొమ్ము సంపాదించానన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో జైలులో డిగ్రీ పూర్తి
అంబేడ్కర్ స్ఫూర్తితో జైలులో అంబేడ్కర్ ఓపె¯ŒS యూనివర్శిటీ ద్వారా డిగ్రీ చదివానని అతడు చెప్పారు. సత్యంబాబుకు సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్ష¯ŒS సొసైటీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీ¯ŒSకుమార్, దళిత సంఘాల నాయకులు బేతాళ వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘ నాయకులు పల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దర్యాప్తు అధికారులపై చర్యలకు ముప్పాళ్ల డిమాండ్
సత్యంబాబును అక్రమంగా కేసులో ఇరికించిన దర్యాప్తు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస జాగ్రత్తలు పాటించని దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సత్యంబాబును జైలుపాలు చేసిన ప్రభుత్వమే అతడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. జైలులో డిగ్రీ పూర్తి చేసిన సత్యం బాబుకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగి అసలు నేరస్తులను వదిలేశారని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆయేషా మీరా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Advertisement
Advertisement