రాంగోపాల్ వర్మ శిష్యుడను.. | satish tamminedu interview with sakshi | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మ శిష్యుడను..

Sep 13 2015 9:28 AM | Updated on Sep 3 2017 9:20 AM

రాంగోపాల్ వర్మ శిష్యుడను..

రాంగోపాల్ వర్మ శిష్యుడను..

పండితవిల్లూరులో పుట్టి పెనుగొండ ఎస్వీకేపీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన తమ్మినీడు సతీష్‌బాబు దర్శకుడయ్యూడు.

పండితవిల్లూరులో పుట్టి పెనుగొండ ఎస్వీకేపీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన తమ్మినీడు సతీష్‌బాబు దర్శకుడయ్యూడు. సొంత ఊరు, విద్య నేర్చిన కాలేజీపై మమకారంతో తొలి సినిమా షూటిం గ్‌ను పండితవిల్లూరులో ప్రారంభించగా తొలి సన్నివేశాన్ని పెనుగొండ కాలేజీలో చిత్రీకరించాడు. ‘జానకిరాముడు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శనివారం పెనుగొండలో జరిగింది. తన సినీ ప్రస్థానం, చిత్ర విశేషాలను  సతీష్ వివరించారు.
 
మా సొంతూరు పోడూరు మండలం పండితవిల్లూరు. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఇంటర్మీడియెట్ సీఈసీ చదివి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్ వెళ్లా. చాలా మంది దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశా. ఇన్నాళ్లకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. తొలి సినిమా జానకిరాముడును కావేరీ మీడియూ పతాకంపై నిర్మిస్తున్నాం.
 
 రాంగోపాల్ వర్మ శిష్యుడను..

దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద రక్తచరిత్ర సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశా. జేడీ చక్రవర్తి, చంద్రసిద్ధార్థ, అజయ్‌బోమన్, మన్మోహన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశా. మాతృభూమిపై మమకారంతో తొలి సినిమా షూటింగ్‌ను మా సొంతూరులో ప్రారంభించా. విద్యాబుద్ధులు నేర్పిన కళాశాలను ప్రేక్షకులకు చూపించాలని పెనుగొండలో షూటింగ్ చేస్తున్నా. రెండు రోజులపాటు ఇక్కడే షూటింగ్ ఉంటుంది. కళాశాలలో నా అనుభవాలను చిత్రంలో చూపించనున్నా. తెలుగు నేల అందాలను ప్రేక్షకులకు చూపించడంతో పాటు అశ్లీలతకు తావు లేకుండా సినిమా తెరకెక్కిస్తా.
 
 ప్రేమకథా చిత్రంగా ‘జానకి రాముడు’
 అశ్లీలతకు తావు లేని ప్రేమకథా చిత్రంగా జానకిరాముడును తీర్చిదిద్దుతా. తొలి రోజు షూటింగ్‌లో భాగంగా కళాశాలకు విద్యార్థులు నడిచి వచ్చే సన్నివేశాలు, హీరో నవీన్, ప్రతినాయకుడు నాగార్జున మధ్య బాస్కెట్‌బాల్ పోటీల సన్నివేశాలను చిత్రీకరించాం. హీరోరుున్ మౌనిక, సహాయ నటుడు జాకీ నటిస్తున్నారు.
 
45 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయూనే లక్ష్యంతో ఉన్నాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఇది ఉంటుంది. పెనుగొండ, పేరుపాలెం, చించినాడ, పాలకొల్లు, కాకినాడ ఇండోర్ స్టేడియంలో షూటింగ్ చేస్తాం. చిత్రంలో సహాయ నటులుగా  శివకృష్ణ, సుధ, పవిత్రా లోకేష్,  సూర్యకమల్ నటిస్తున్నారు. సంగీతం గిప్టన్ అందిస్తుండగా స్టంటు మాస్టార్‌గా నందు, కెమెరామెన్‌గా సురేష్ వ్యవహరిస్తున్నారు. చిత్ర సీమలో మంచి దర్శకుడిగా స్థిరపడటమే నా లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement